చలువ అని కీరా ముక్కలతో కలువ కన్నులు మూసేస్తాం.. మేను నిగనిగలాడాలని దానిమ్మ రసాన్ని పూతపూస్తాం.. పైపై మెరుగులు ఆ పూటకు పనికొస్తాయి.. వయసుకు గాలం వేసి అందాన్ని అందలం ఎక్కించాలంటే.. అవకాడో తెనాల్సిందే
TV9 Telugu
అందుకే అవకాడో పండుని యాంటీ ఏజింగ్ ఫుడ్ అని అంటారు. వయసుని వెనక్కి పరుగులు పెట్టించే ఆహారం ఇది. దీని ప్రయోజనం జీవితకాలాన్ని పెంచడం మాత్రమే అనుకుంటే పొరపాటు
TV9 Telugu
ఆరోగ్యవంతమైన చర్మం, నిగనిగలాడే జుట్టు వంటివి కూడా తోడయ్యేలా చేసి పెరుగుతున్న వయసు ఛాయలని తొలగించి యౌవ్వనంగా కనిపించేటట్టు చేస్తుంది
TV9 Telugu
అందం బయట నుంచి రాదు... లోపల నుంచి ప్రారంభమవుతుంది. ఆశ్చర్యపోవద్దు. జీర్ణశక్తి చక్కగా ఉంటే తక్కిన వ్యవస్థలన్నీ సవ్యంగా పనిచేసి ఆ అందమంతా ముఖంలో ప్రతిఫలిస్తుంది
TV9 Telugu
వయసును వెనక్కి నెట్టే పోషకాలు అవకాడోలో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె, చర్మం, జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు K, C, E, B6, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ముదురు ఆకుపచ్చ, ఒకింత నలుపు రంగులో కనిపించే అవకాడో పండులో పోషకాలు దండిగా ఉంటాయి. దీంతో 20 రకాల విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి
TV9 Telugu
ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు ఆమ్లాల (మోనోఅన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్- ఎంయూఎఫ్‌ఏ) శాతమూ ఎక్కువే. ఇవే ఇప్పుడు పరిశోధకులను ఆకర్షిస్తున్నాయి. అవకాడోలో అవకాటిన్ బి అనే కొవ్వు అణువులుంటాయి
TV9 Telugu
దీనికి అక్యూట్ మైలాయిడ్ ల్యుకీమియా (ఏఎంఎల్) అనే తీవ్ర రక్తక్యాన్సర్ కణాలను అడ్డుకునే గుణం ఉండటం విశేషం. అవకాటిన్ బి మధుమేహ నివారణ, ఊబకాయ నియంత్రణకు తోడ్పడుతున్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాల్లో బయటపడింది