ఘుమ ఘుమలాడే టీ రుచులకు మైమరచిపోతున్నారా? ఇటు ఓ లుక్‌ వేయండి..

02 June 2025

TV9 Telugu

TV9 Telugu

టీకి సాటి టీనే! ఉదయమైనా.. సాయంత్రమైనా.. ఘుమఘుమలాడే తేనీరు తాగుతుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. అంతేకాదు, శరీరానికీ చాలా లాభాలున్నాయి

TV9 Telugu

మన దేశంలో టీ ప్రియులు చాలామందే ఉన్నారు. చాలా వరకు కప్పు వేడి వేడి టీతో చాలా మందికి ప్రతి ఉదయం ప్రారంభం అవుతుంది

TV9 Telugu

ఇలా రోజు మొత్తంలో పలమార్లు టీ రుచులు ఆశ్వాదిస్తుంటారు. పాలతో టీ తాగడానికి అధిక శాతం ఇష్టపడతారు. కానీ ఒక రోజులో ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి అంతమంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

టీ అధికంగా తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలో నిపుణులు చెబుతున్నారు. రోజులో ఎక్కువగా టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. రోజుకు 2 నుంచి 3 కప్పుల టీ తాగడం మంచిది. కానీ అంతకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం

TV9 Telugu

టీలో కెఫిన్ ఉంటుంది. దీనిని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి, హృదయ స్పందన రేటు పెరగడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

ముఖ్యంగా పాలు, చక్కెర కలిపిన టీ తాగే వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయి క్షీణించడం, బరువు పెరగడం, ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది

TV9 Telugu

ఎక్కువగా టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్‌ శోషణ కూడా తగ్గుతుందని, దీనివల్ల రక్తహీనత అంటే రక్తం లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు

TV9 Telugu

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అందువల్ల రోజుకు 2 కప్పుల టీ తాగడం శ్రేయస్కరం. హెర్బల్ లేదా గ్రీన్ టీ వంటి ఎంపికలు అయితే మరీ మంచిది