గుడ్లు ఒంట్లో కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారమా? వీటిని తినకూడదా..?
24 May 2026
TV9 Telugu
TV9 Telugu
కోడిగుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ మన శరీరానికి హాని చేస్తుందా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. దీంతో గుడ్డు పచ్చసొన తినాలా వద్దా అనే విషయంలో సందేహాలు ప్రతి ఒక్కరికీ వస్తాయి
TV9 Telugu
గుడ్డు పచ్చసొన వల్ల గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుందని భావించేవారూ ఉన్నారు. అయితే తాజా పోషకాహార పరిశోధనలు ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి
TV9 Telugu
గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ కంటే మన మొత్తం ఆహారపు అలవాట్లే ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయట. గుడ్డు పచ్చసొనలో సుమారు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు రోజుకు 300 మిల్లీగ్రాముల వరకు కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు
TV9 Telugu
ఈ కారణంగా చాలామంది గుడ్డు పచ్చసొన తింటే రక్తంలో కొలెస్ట్రాల్ వెంటనే పెరుగుతుందని భావిస్తుంటారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచదని చెబుతున్నారు
TV9 Telugu
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం శాచురేటెడ్ ఫ్యాట్స్. అంటే అధికంగా వేయించిన పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక కొవ్వు ఉన్న ఆహారాలు ఎక్కువ హానికరమని చెబుతున్నారు. సహజసిద్ధమైన గుడ్లు వంటి ఆహారాలను పూర్తిగా మానేయడం సరైన పరిష్కారం కాదు
TV9 Telugu
గుడ్లను చాలామంది కేవలం కొలెస్ట్రాల్ మూలంగా మాత్రమే చూస్తారు. కానీ అవి అనేక ముఖ్యమైన పోషకాల నిల్వగా కూడా గుర్తింపు పొందాయి. గుడ్లలో విటమిన్ ఎ, బి విటమిన్లు, ఫోలేట్, సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుడ్డు పచ్చసొన పూర్తిగా తొలగిస్తే ఈ ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
రోజుకు ఎంతమేర గుడ్లు తినాలి అనే విషయానికి వస్తే, సమతుల్యత చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు నాలుగు గుడ్డు తెల్లసొనలు, రెండు పచ్చసొనలు తినవచ్చు. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు కూడా రోజుకు నాలుగు తెల్లసొనలు, ఒక పచ్చసొన తినవచ్చు