రోజూ ఓ స్ఫూన్‌ యాపిల్ వెనిగర్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

16 February 2025

TV9 Telugu

TV9 Telugu

వెనిగర్‌ని పచ్చళ్లు, మాంసాహార వంటకాల్లో నిల్వకారకంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో రెండు రకాలుంటాయి. ఒకటి బ్రూడ్‌ వెనిగర్‌.. దీనిని సహజమైన ఆహార పదార్థాల నుంచి తయారుచేస్తారు

TV9 Telugu

బంగాళాదుంపలు, యాపిల్‌, బియ్యం, తేనె ఇలా వివిధ పదార్థాల నుంచి తయారుచేస్తారు. ఇక ఇది మంచిదా కాదా అంటే.. వెనిగర్‌ని ఫంక్షనల్‌ ఫుడ్‌ అంటారు. అంటే ఒక పక్క పోషకాలు అందిస్తూ, మరోపక్క కొన్ని రకాల అనారోగ్య కారకాలకు చెక్‌పెడుతుంది

TV9 Telugu

దీనిలోని సి విటమిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చళ్లు, మాంసాహార వంటకాలను బ్యాక్టీరియా వైరస్‌ల నుంచి రక్షణగా నిలుస్తుంది. పొటాటోవెనిగర్‌, స్పైసెస్‌ వెనిగర్‌, మాల్ట్‌, హని, మొలాసిస్‌ వెనిగర్‌ వంటివి వివిధ రుచుల్లో లభిస్తాయి

TV9 Telugu

 ఇక రెండో రకం ఆర్టిఫిషియల్‌ వెనిగర్‌. పల్చగా చేసిన ఎసిడిక్‌ యాసిడ్‌ ఇది. ఇది కూడా తినడానికి అనువైనదే. కాబట్టి వంటల్లో వెనిగర్‌ని నిర్భయంగా వాడుకోవచ్చు

TV9 Telugu

సాధారణంగా ఆహార రుచిని పెంచడానికి వెనిగర్ ఉపయోగిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు, చర్మ సంరక్షణతో పాటు, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యం వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు వెనిగర్ ఉపయోగించబడుతుంది

TV9 Telugu

రోజూ ఒక చెంచా వెనిగర్ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇది ట్రైగ్లిజరైడ్‌లను నియంత్రణలో ఉంచుతుంది. జీవక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది

TV9 Telugu

ఇందులో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. ఎసిటిక్ ఆమ్లం శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. వెనిగర్ వాడటం వల్ల అథెరోస్క్లెరోసిస్ సమస్య నుంచి బయటపడవచ్చు

TV9 Telugu

ఇది ధమనులలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే పరిస్థితి. గ్లాసు నీటిలో ఒక చెంచా వెనిగర్ కలిపి తాగడం వల్ల గ్యాస్, కడుపు చికాకు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది