ముగింట్లో విరగబూసే మందారంతో.. ఆరోగ్య సౌభాగ్యాలు!

17 February 2025

TV9 Telugu

TV9 Telugu

మన ముంగిట్లో మొక్కలెన్ని ఉన్నా... మందారం ప్రత్యేకం. రకరకాల వర్ణాలు, ఆకృతుల్లో... పెద్ద పెద్ద పూలతో నిండుగా విరబూస్తుంది. నేలలోనే కాదు కుండీల్లోనూ చక్కగా విరబూస్తుంది

TV9 Telugu

ఈ మొక్క ఉష్ణ, సమశీతోష్ణ మండల వాతావరణంలో సులువుగా ఎదుగుతుంది. మందారాన్నే దీన్ని చైనీస్‌ రోజ్‌ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం... హైబిస్కస్‌ రోజాసైనేన్సిస్‌

TV9 Telugu

ఇది ఎరుపు, పసుపు, తెలుపు, కాషాయం, గులాబీ... ఇలా బోలెడు రంగులు, వివిధ ఆకృతుల్లో చెట్టు నిండా పూలతో కనువిందు చేస్తుంది

TV9 Telugu

ఈ పూలలోని మకరందం సీతాకోక చిలుకలు, హమ్మింగ్‌ బర్డ్స్‌ని మరింత ఆకర్షిస్తాయి. ఈ పువ్వు, ఆకుల్లో ఔషధ గుణాలెన్నో అందుకే ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడతారు

TV9 Telugu

జుట్టు రాలడానికి మందార పువ్వు మంచి నివారణ అని అందరికీ తెలిసిన విషయమే. కానీ అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మీకు తెలుసా?

TV9 Telugu

మందార మొగ్గలను రుబ్బి వాటి రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా ఉంటుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మందార ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది

TV9 Telugu

మందార పువ్వులను ఆహారంలో తీసుకోవడం వల్ల కొవ్వును కరిగించి శరీర బరువు తగ్గుతుంది. మందార ఆకులతో చేసిన టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

విటమిన్ సి పుష్కలంగా ఉండే మందార పువ్వులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది గొంతు నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. తరచుగా జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు మందార టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు