పాలకు సంబంధించిన పదార్థాల్లో పనీర్‌ది ప్రత్యేక స్థానం. వీటితో చేసే కూరలు, స్వీట్లను చాలామంది ఇష్టపడి తింటుంటారు. పనీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తక్కువేమీ కాదు
TV9 Telugu
పనీర్‌లో మంచి కొవ్వులు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎక్కువసేపు అలసట లేకుండా పని చేయచ్చు. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ తదితర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి వివిధ అనారోగ్య సమస్యల నుంచి రక్షణ అందిస్తాయి
TV9 Telugu
పనీర్‌లో ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో చాలా విటమిన్లు కూడా ఉంటాయి. పనీర్‌లో ఉండే విటమిన్ బి12 మెదడు, నాడీ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది
TV9 Telugu
అలాగే బలహీనత, తలతిరగడం, జ్ఞాపకశక్తి సమస్యలను నివారిస్తుంది. పనీర్‌లో విటమిన్ డి ఉంటుంది. ఈ విటమిన్ శరీరంలో కాల్షియం బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
TV9 Telugu
పనీర్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపుకు చాలా అవసరం. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది
TV9 Telugu
పనీర్‌లో ఉండే విటమిన్ బి2 శక్తి స్థాయిని పెంచుతుంది. జీవక్రియను సరిగ్గా ఉంచుతుంది. అలాగే ఇది చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది
TV9 Telugu
పనీర్‌లో విటమిన్ K2 ఉంటుంది. ఇది ఎముకలకు కాల్షియం రవాణా చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది