గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుంది?
18 October 2025
TV9 Telugu
TV9 Telugu
చాలా మంది పొద్దునే గోరువెచ్చని నీటిల్లో నిమ్మకాయ రసం కలుపుని తాగుతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి పని ఈ నీళ్లు తాగడమే
TV9 Telugu
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం ఆరోగ్యానికి నిజంగా మంచిదో? కాదో? చాలా మందికి క్లారిటీ ఉండదు. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
TV9 Telugu
నిజానికి, గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది
TV9 Telugu
బరువు తగ్గడానికి గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి తాగడం చాలా మంచిది. ముఖ్యంగా,ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది
TV9 Telugu
నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
అలాగే జీర్ణ శక్తి బాగుండాలంటే రోజూ ఉదయాన్నే పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగాలి
TV9 Telugu
ఈ చిట్కా ఇప్పటికే చాలా మంది చెప్పి ఉంటారు. నిజానికి దీని వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. పైగా కొవ్వు కూడా కరిగిపోయి సన్నబడడానికి తోడ్పడుతుంది
TV9 Telugu
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో పాటు గోరు వెచ్చని నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుంది