వానాకాలంలో ఆరోగ్యానికి పసుపు రక్ష.. ఎలా తీసుకోవాలంటే?

03 July 2025

TV9 Telugu

TV9 Telugu

పసుపు అనేది దుంప నుంచి తయారు చేసిన ఓ సుగంధ ద్రవ్యం. దీనిని అనేక వంటలలో ఉపయోగిస్తారు. ఈ సుగంధ ద్రవ్యం వంటకాల రంగు, రుచి రెండింటినీ మారుస్తుంది

TV9 Telugu

పసుపు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనది. ఇందులో విటమిన్ సి, ఐరన్, బి-6, కాల్షియం, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు దందిగా ఉంటాయి

TV9 Telugu

గాయాలను నయం చేయడంలో పసుపు ప్రభావవంతంగా ఉంటుంది. కోతలు, గీతలపై పసుపు పేస్ట్‌ను పూయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. పసుపు మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది

TV9 Telugu

గాయాల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్‌ను కూడా పసుపు నివారిస్తుంది. శరీరంలోని ఏ భాగంలోనైనా గాయం కారణంగా నొప్పి తలెత్తితే పసుపు, ఆవ నూనె కలిపి పూయవచ్చు

TV9 Telugu

నిమ్మ, పసుపు మిశ్రమం పూయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. పురాతన కాలం నుంచి చర్మ సంరక్షణలో పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు, పాలతో ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేస్తే చర్మం భలేగా మెరుస్తుంది

TV9 Telugu

పసుపు దంతాలను ప్రకాశవంతం చేయడంలో, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ ప్రభావవంతంగా ఉంటుంది. ఇది దంత క్షయాలను నివారిస్తుంది. ఆవ నూనెలో పసుపు, ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేసుకోవచ్చు

TV9 Telugu

ప్రతి రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ సమస్యలను కూడా నివారిస్తుంది

TV9 Telugu

అందుకే జలుబు చేసినా జ్వరంగా ఉన్నా దగ్గుతున్నా కాస్త పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగమని చెబుతుంటారు బామ్మలు. అప్పుడనే కాదు, వర్షాలు మొదలు కాగానే పసుపులో కాస్త బెల్లం కలిపి చిన్న మాత్రల్లా చేసి ఇంటిల్లిపాదీ పరగడుపునే మింగినా చాలా మంచిది