ఈ గింజల్ని గుర్తుపట్టారా? వీటి లాభాలు తెలిస్తే షాక్ అవుతారు
24 November 2025
TV9 Telugu
TV9 Telugu
చింతపండు తెలియని వారుండరు. రకరకాల వంటల్లో వీటిని వాడుతుంటాం. అయితే ఇందులో ఉండే చింత గింజలను పడేస్తారు. కానీ ఆయుర్వేద ప్రకారం చింత గింజల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి
TV9 Telugu
ఈ గింజల్లో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఫైబర్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని పెంచి ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది
TV9 Telugu
పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. చింత గింజలు ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. అందువల్ల వీటిని తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది
TV9 Telugu
చింత గింజలు షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం చింత గింజలను తినడం వల్ల వాటిల్లో ఉండే సమ్మేళనాలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది
TV9 Telugu
చింత గింజల్లోని యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలు, మోకాళ్ల సమస్యలు ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
ఈ గింజలను తినడం వల్ల కీళ్లలో గుజ్జు పెరుగుతుంది. దీంతో కీళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేస్తాయి
TV9 Telugu
సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. వీటిల్లోని యాంటీ సెప్టిక్ గుణాలు నోట్లో ఉండే బ్యాక్టీరియా నశింపజేసి, నోటి దుర్వాసన తగ్గేలా చేస్తుంది
TV9 Telugu
కడిగి ఎండబెట్టిన గంజనలను పెనంపై వేయించి, పొట్టు తీసేసి మెత్తని పొడిలా పట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో భోజనం తర్వాత 30 నిమిషాలు ఆగి ఈ నీళ్లు తాగితే మంచిది