పోషకాల మూట.. ఎర్రెర్రని టమాట!

29 September 2025

TV9 Telugu

TV9 Telugu

దాదాపు అన్ని వంటకాల్లో విరివిగా ఉపయోగించే టొమాటోల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే వీటిని అనాదిగా వంటకాల్లో ఉపయోగిస్తున్నారు

TV9 Telugu

వీటిలో విటమిన్లు ‘ఎ’, ‘సి’, పొటాషియం, క్యాల్షియం.. వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కాయగూరలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంది

TV9 Telugu

ఎర్రగా మిలమిలలాడే టొమాటోల్లో ఉండే అందం, ఆకర్షణ మరే ఇతర కూర గాయల్లోనూ ఉండదు. ఇవి చూపులకే కాదు, ఆరోగ్యానికీ అంతే మంచివి

TV9 Telugu

టోమాటోల్లో ఉండే లైకోపీన్‌ అల్ట్రా కిరణాల నుంచి శరీరానికి రక్షణ ఇస్తుంది. చర్మానికి కాంతినిస్తుంది. ఇందులోని పొటాషియం రక్తపోటు, హృద్రోగాల బారినుంచి కాపాడుతుంది

TV9 Telugu

ఫైబర్‌ ఎక్కువగా ఉండటాన అరుగుదలకు ఉపయోగపడతాయి. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. టోమాటోల్లో ఉన్న కెరొటినాయిడ్స్‌.. లుటిన్‌, లైకోపిన్‌, బెటా కెరోటిన్‌లు కళ్లను సంరక్షిస్తాయి

TV9 Telugu

ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా గుణాలు రక్తప్రసరణ బాగుండేలా, కొలెస్ట్రాల్‌ లెవెల్‌ సమంగా ఉండేలా చేస్తాయి

TV9 Telugu

విటమిన్‌-కె బ్లడ్‌ క్లాట్స్‌ను నివారిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఇందులో బి, సి, ఇ విటమిన్లు విస్తారంగా ఉన్నందున మంచి పోషకాహారం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

TV9 Telugu

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఔషధంలా పనిచేయడమే కాదు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్లు రాకుండా చేస్తాయి