చలికాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. శరీరానికి ఎండ సరిగ్గా తగలక విటమిన్ ‘డి’ లోపం తలెత్తి.. రోగనిరోధక శక్తీ క్షీణిస్తుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఈ సమస్యల్ని నివారించాలంటే ఈ సీజన్‌లో వచ్చే రేగు పండ్లు తప్పక తీసుకోవాలి
TV9 Telugu
శీతాకాలంలో వచ్చే రేగు పండులో విటమిన్ సితో పాటు ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రేగి పండ్లు మీ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. దీన్ని తినడం వల్ల అజీర్ణం, ఆమ్లత్వం మొదలైన సమస్యలన్నీ దూరం అవుతాయి
TV9 Telugu
రేగు పండ్లు తీసుకోవడం చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొల్లాజెన్‌ను పెంచడానికి అవసరమైన విటమిన్ సీ ఇందులో అధికంగా ఉంటుంది
TV9 Telugu
కాబట్టి రేగు పండ్లు తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది. వైరల్ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది
TV9 Telugu
ఇందులో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. తద్వారా ఎముక విరుపులకు చెక్ పెట్టచ్చు.. అలాగే భవిష్యత్తులో ఆస్టియోపొరోసిస్ సమస్య రాకుండా కూడా జాగ్రత్తపడచ్చు
TV9 Telugu
రేగు పండ్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెకు ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
ఇందులో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. తద్వారా ఎముక విరుపులకు చెక్ పెట్టచ్చు.. అలాగే భవిష్యత్తులో ఆస్టియోపొరోసిస్ సమస్య రాకుండా కూడా జాగ్రత్తపడచ్చు