కీరదోస ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది
TV9 Telugu
అయితే కీరదోసలో నిమ్మరసం కలిపి ఎప్పుడైనా తీసుకున్నారా? ఇలా కీర, నిమ్మ రెండూ కలిపి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
కీరదోసలో విటమిన్ ఎ, సి, కె, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి
TV9 Telugu
కీరదోసను నల్ల ఉప్పు, నిమ్మకాయతో కలిపి తింటే దాని రుచి మరింత అద్భుతంగా మారుతుంది. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయట
TV9 Telugu
కీరదోస, నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను పెంచుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. దద్దుర్లు, చికాకు, మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
TV9 Telugu
కీరదోసలో ఫైబర్ ఉండగా, నిమ్మకాయ శరీరంలో హైడ్రేషన్ స్థాయిని పెంచుతుంది. కాబట్టి ఈ రెండూ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి
TV9 Telugu
కీరదోస, నిమ్మకాయ రెండింటిలోనూ తక్కువ కేలరీలు ఉంటాయి. దీనిలోని ఫైబర్ మన జీవక్రియను కూడా పెంచుతుంది. బరువు తగ్గడంలో నిమ్మకాయ వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది
TV9 Telugu
కీరదోస, నిమ్మకాయలలో విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ప్రతి సీజన్‌లో పలు ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు