మండే ఎండలో శరీరానికి చలువనిచ్చేలా ఏదైనా తింటే బాగుండనిపించేవారి తొలి ఎంపిక కీరా దోస. ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఈ దోసకాయ వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది
TV9 Telugu
ఎండాకాలంలోనే కాకుండా చల్లటి వాతావరణంలో కూడా దీన్ని తప్పకుండా తినాలి. కీరదోసకాయ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి
TV9 Telugu
కీరదోస జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో నీటి శాతం సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్దకాన్ని దూరం చేస్తుంది. కీర చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది
TV9 Telugu
అందుకే దీన్ని చాలా ఫేస్ ప్యాక్‌లు, బ్యూటీ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. కీరదోసకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల చర్మం సహజంగా కాంతివంతంగా మెరుస్తుంది
TV9 Telugu
గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే కీర దోస ప్రతి రోజూ తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో దోసకాయ తినడం వల్ల క్యాలరీలు తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది
TV9 Telugu
దోసకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఎముకలు బలహీనపడకుండా కాపాడతాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, సిలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి
TV9 Telugu
నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరా దోస కూడా ఒకటి. దాదాపు 96 శాతం వరకు నీరు ఉండే దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందచ్చు. తద్వారా శరీరానికి చలువ కూడా చేస్తుంది
TV9 Telugu
బీపీ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు కీరా దోసకాయ తినడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది