క్యాన్సర్ అంతుచూసే యాలకులు.. రోజుకు 2 నోట్లో వేసుకుంటే సరి..

06 February 2025

TV9 Telugu

TV9 Telugu

యాలకులు సువాసనా, రుచీ కోసం మాత్రమే కాదు... వాటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయంటున్నాయి పలు అధ్యయనాల్లో తేలాయి

TV9 Telugu

క్యాన్సర్‌ కారక కణాలు పెరగకుండానూ అడ్డుకుంటాయట. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. అన్నం తిన్నాక రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే చాలు... ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది

TV9 Telugu

వీటిలోని ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటబాలిజం రేటుని మెరుగు పరుస్తాయి. నోటి దుర్వాసన తగ్గిస్తాయి. యాలకుల్ని ఆహారంలో భాగం చేసుకుంటే... శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

యాలకులు ఆహార రుచిని పెంచడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం, యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి

TV9 Telugu

యాలకులు నమలడం వల్ల శ్వాసకోశ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇది దుర్వాసన లేదా హాలిటోసిస్ నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. యాలకులు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి

TV9 Telugu

అంటే ఇది శరీరంలో చికాకు, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గిస్తాయి. ఇది దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది

TV9 Telugu

కొన్ని పరిశోధనల ప్రకారం యాలకులు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని తేలింది. యాలకులు ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఆందోళనను తగ్గించడానికి చికిత్సలలో ఉపయోగిస్తారు

TV9 Telugu

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. యాలకుల్లో ఉండే కీలక విటమిన్లు,  ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌... జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి