రాత్రి నిద్రకు ముందు పాలల్లో ఇది చిటికెడు కలిపి తాగారంటే..
28 February 2025
TV9 Telugu
TV9 Telugu
ఆయుర్వేధంలో వేల సంవత్సరాల నుంచీ వైద్యులు అశ్వగంథను వాడుతున్నారు. అది అద్భుతమైన ఔషధమనీ, ముఖ్యంగా స్త్రీలలో బరువు తగ్గేందుకూ ఒత్తిడిని తగ్గించేందుకూ తోడ్పడుతుందనీ, దీన్ని వాడటం వల్ల శారీరకంగానూ మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చట
TV9 Telugu
హార్మోన్ల అసమతౌల్యంతో తలెత్తే మధుమేహ సమస్యల్నీ ఇది నిరోధిస్తుంది. కాబట్టి పీసీఓడీ, ఇతరత్రా నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకి ఇది ఎంతో మేలు చేస్తుంది. మెనోపాజ్ సమయంలో తలెత్తే అనేక సమస్యలకు ఇది మందులా పనిచేస్తుంది
TV9 Telugu
ముఖ్యంగా అశ్వగంథ కలిపిన పాలు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అశ్వగంధ ఒక ఔషధ మూలిక. దీనిని పాలలో కలిపి తాగితే శరీరం, మనస్సు రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
అశ్వగంథ ఔషధ మూలికలో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. అశ్వగంధను పాలలో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచడంలో పాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందులో అశ్వగంధను తీసుకుంటే ఎముకలు మరింత ధృడంగా మారుతాయి
TV9 Telugu
పాలు, అశ్వగంథ తాగడం వల్ల జీర్ణ సంబంధిత రుగ్మతలు కూడా తొలగిపోతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి
TV9 Telugu
పాలు, అశ్వగంథ కలిపి తాగితే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలు పెరిగే లేదా తగ్గే ప్రమాదం ఉంది. అదే ఈ రెండు కలిపి తాగితే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది
TV9 Telugu
నేటికాలంలో జనాలు ఒత్తిడి కారణంగా ఆందోళన, నిరాశకు గురవుతున్నారు. మీరు పాలు, అశ్వగంధ కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది
TV9 Telugu
వారానికి మూడు రోజులు అశ్వగంధ కలిపిన వేడి పాలు రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. గ్లాసుడు పాలల్లో ఒక అశ్వగంధ మాత్ర తీసుకుంటే సరిపోతుంది