శెనగలు పొద్దుపొద్దున ఇలా తిన్నారంటే.. పుట్టెడు లాభాలు!

14 May 2025

TV9 Telugu

TV9 Telugu

పొద్దున్నే కఠిన వ్యాయామాలు చేసేవాళ్లు దానికిముందు ఏదో ఒకటి తినడం మంచిది. ఉదయాన్నే తినగలిగేవాటిలో కొమ్ము శెనగలు ఒకటి. వీటిని రాత్రి నీళ్లలో నానబెట్టి తెల్లవారే తీసుకుంటే ఎన్ని లాభాలో..

TV9 Telugu

నానబెట్టిన శెనగల్లో కార్బొహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని తక్షణం అందించడమే కాదు, అదే స్థాయిలో శక్తిని రోజంతా అందేలా చూస్తాయి

TV9 Telugu

నానబెట్టిన శెనగల్లో ఫైబర్‌ ఎక్కువే. దాంతో త్వరగా ఆకలి వేయదు. వీటిలోని విటమిన్‌-సి, విటమిన్‌-ఇ, బీటా కెరోటిన్‌... వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌, హృద్రోగాలనుంచీ కాపాడతాయి

TV9 Telugu

శెనగల్లో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శెనగలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అత్యధిక మొత్తంలో విటమిన్ బి ఉంటుంది

TV9 Telugu

దీనితో పాటు, విటమిన్ ఎ, సి, విటమిన్ డి, ఇ, కె కూడా లభిస్తాయి. ముఖ్యంగా శెనగలు చక్కెర రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వేయించిన శనగపప్పు గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది

TV9 Telugu

డయాబెటిస్ ఉన్నవారు దీన్ని స్నాక్ గా తినవచ్చు. అలాగే అధిక కొలెస్ట్రాల్ ఉన్న రోగులకు శెనగలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఉడకబెట్టినా.. వేయించినా.. ఎలా తీసుకున్నా శెనగలు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు

TV9 Telugu

శెనగలు తినడం వల్ల కడుపు, జీర్ణవ్యవస్థ బలపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.బరువు తగ్గడంలో వేయించిన శెనగలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి

TV9 Telugu

వేయించిన శెనగల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. రక్తహీణతతో బాధపడేవారు ఖచ్చితంగా శనగపప్పు తినాలి. శెనగలు తినడం వల్ల ఇనుము లోపాన్ని అధిగమించవచ్చు