రాత్రంతా నానబెట్టిన పెసర పప్పు ఉదయం ఖాళీ కడుపుతో తిన్నారంటే..

07 May 2025

TV9 Telugu

TV9 Telugu

పప్పు దినుసుల్లో మాంసక‌ృత్తులు సమృద్ధిగా ఉంటాయి.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పప్పు దినుసుల్లో పెసర పప్పు చాలా ప్రత్యేకం

TV9 Telugu

ఎందుకంటే పెసర పప్పులో ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్-బి6, నియాసిన్, ఫోలేట్ వంటి ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు దండిగా ఉంటాయి. దీంతోపాటు పెసర పప్పును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు పెరగడాన్ని నియంత్రించుకోవచ్చు

TV9 Telugu

అంతేకాకుండా గ్యాస్ లాంటి జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. పెసర పప్పు ఒంటిరి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. అందుకే వేసవిలో దీనిని తినడం మంచిది. ఈ పప్పులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని వినియోగం మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది

TV9 Telugu

శరీరం తరచుగా వచ్చే నీరసంకి పెసర పప్పు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడతాయి

TV9 Telugu

ముఖ్యంగా రాత్రంతా నానబెట్టిన పెసర పప్పు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా తినడం ద్వారా చర్మం, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఇతర పోషకాలు ఉంటాయి

TV9 Telugu

పెసర పప్పు ప్రోటీన్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా దీనిని తిన్న తర్వాత, చాలా సేపటి వరకు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. తక్కువ తినాలని అనిపిస్తుంది

TV9 Telugu

పెసర పప్పు తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగదు. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల ఇది డయాబెటిక్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది