పాలల్లో నానబెట్టిన మఖానా ఎప్పుడైనా తిన్నారా? 

08 May 2025

TV9 Telugu

TV9 Telugu

తిరుగులేని టైంపాస్‌ స్నాక్స్‌గా ఇదివరకు పాప్‌కార్న్‌ మాత్రమే ముందుగా గుర్తొచ్చేదా... కానీ ఇప్పుడు దాని పక్కనే వచ్చి చేరింది ఫూల్‌ మఖానా కూడా

TV9 Telugu

తెల్లతెల్లటి బంతుల్లా కాస్త అటూఇటూగా పాప్‌కార్న్‌లా కనిపించే ఈ మఖానా- వట్టి కాలక్షేపానికే కాదు, సూపర్‌ఫుడ్‌గానూ ముందు వరసలోకి వెళ్లింది

TV9 Telugu

చెరువులూ, బురద నీటి గుంటల్లో అందంగా విరిసే తామర పూల నుంచే వస్తాయీ మఖానా. అయితే అన్ని రకాల తామర పూల విత్తనాల నుంచీ కాదు

TV9 Telugu

రకరకాల లోటస్‌సీడ్స్‌ను కొన్నిచోట్ల వంటకాల్లో ఉపయోగించినా ఫూల్‌ మఖానా తయారయ్యేది మాత్రం యూర్‌యల్‌ ఫారెక్స్‌, ప్రిక్లీ అనే వాటర్‌ లిల్లీ నుంచే

TV9 Telugu

సూపర్ ఫుడ్‌గా పిలిచే మఖానా వేసవిలో మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది ఒంటికి చలువ చేసే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

అయితే మఖానాను నేరుగా ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. లేదంటే మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. బదులుగా మఖానాను పాలల్లో నానబెట్టి తినవచ్చు. పాలను వేడి చేయకుండా పచ్చిపాలల్లోనే వీటిని నేరుగా నానబెట్టి తీసుకోవచ్చు

TV9 Telugu

ఒకటి నుండి రెండు గంటలు నానబెడితే సరిపోతుంది. ఇలా పచ్చి పాలలో నానబెట్టిన మఖానాను తినడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు లభిస్తాయి. ఎందుకంటే వంట ప్రక్రియలో అనేక విటమిన్లు నాశనం అవుతాయి

TV9 Telugu

పచ్చి పాలలో నానబెట్టిన మఖానా తినడం వల్ల అధిక మొత్తంలో కాల్షియం, ఎముకలను బలపరిచే విటమిన్ డి కూడా లభిస్తాయి. ఇది ఒంట్లో శక్తిని పెంచుతుంది. అలసటను దూరం చేస్తుంది