తమలపాకులో వీటిని కలిపి తిన్నారంటే ఒత్తిడి చిత్తే..!

05 April 2025

TV9 Telugu

TV9 Telugu

పూజలు, శుభకార్యాలకు, ముత్తైదువులకు వాయనమివ్వడానికి శుభప్రదంగా వాడే తమలపాకులు కొన్ని రకాల అనారోగ్యాల్నీ దూరం చేస్తాయంటున్నారు నిపుణులు

TV9 Telugu

ఇందుకు వీటిలోని ఔషధ గుణాలే కారణమట! ముఖ్యంగా తమలపాకు, లవంగం, ఏలకులు కలిపి తినడం వల్ల శరీరానికి విటమిన్ సి, బి, కె, ఎ, కాల్షియం, ఐరన్, ఫైబర్, థయామిన్, కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి

TV9 Telugu

తమలపాకులు, లవంగాలు, యాలకులు ఈ మూడింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తమలపాకుతో కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు

TV9 Telugu

తమలపాకు, లవంగం, ఏలకులు మూడు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తాయి. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం వంటి సమస్యలు రావు

TV9 Telugu

పైగా ఈ మూడు పదార్ధాలు సహజ సువాసనను కలిగి ఉంటాయి. ఇవి నోటిని తాజాగా ఉంచుతాయి. అలాగే నోటి బ్యాక్టీరియాను చంపుతాయి. తద్వారా దుర్వాసన తొలగిపోతుంది

TV9 Telugu

తమలపాకులు, ఏలకులు, లవంగాలు ఈ మూడింటిలోనూ యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది

TV9 Telugu

లవంగాలలో యూజినాల్ అనే మూలకం ఉంటుంది. ఇది సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. తమలపాకు, ఏలకులతో కలిపి దీన్ని తినడం వల్ల తలనొప్పి, పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది 

TV9 Telugu

తమలపాకులు, యాలకులు, లవంగాలలో ఉండే సహజ నూనెలు ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని తాజాగా ఉంచుతాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది