మత్తెక్కించే కాఫీ ఘుమఘుమలు మీకూ ఇష్టమా..?

09 July 2025

TV9 Telugu

TV9 Telugu

పొద్దున్నే రెండు గుక్కలు కాఫీ తాగితే ఆ కిక్కే వేరు. మత్తెక్కించే ఆ వాసన ఎక్కడ లేని ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ అందిస్తుంది, అలసటను దూరం చేస్తుంది. అయితే కొంతమంది ఆరోగ్య రిత్యా బ్లాక్‌ కాఫీ తాగేందుకు ఆసక్తి చూపుతారు

TV9 Telugu

అయితే మోతాదు మించి తాగితే మాత్రం కష్టాలను కొనితెచ్చుకున్నట్టే అంటున్నారు నిపుణులు. అధికంగా తీసుకుంటే మాత్రం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కాఫీలో ఉండే కెఫీన్‌ శరీరం ఐరన్‌ గ్రహించటంలో ఆటంకం కలిగిస్తుంది. ఎముకలు గుల్లబారేలా చేస్తుందట

TV9 Telugu

ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగితే కాలేయానికి ఎంతోమేలని నిపుణులు అంటున్నారు. బ్లాక్ కాఫీ కాలేయ ఎంజైమ్ స్థాయిలను పెంచుతుందట. ఇది రక్తం నుంచి విషాన్ని ఫిల్టర్ చేసే శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది

TV9 Telugu

రెగ్యులర్ కాఫీ తాగేవారిలో అలనైన్ అమినోట్రాన్స్‌ఫేరేస్ వంటి ఎంజైమ్‌లు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటాయని పలు అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తాగడం వల్ల సిర్రోసిస్, ముఖ్యంగా ఆల్కహాల్ ప్రేరిత సిర్రోసిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు

TV9 Telugu

కొన్ని అధ్యయనాలు కాఫీ ఎక్కువగా తాగేవారికి సిర్రోసిస్ ప్రమాదం 65% నుండి 80% తక్కువగా ఉంటుందని తేలింది. కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాలేయ వాపు, ఫైబ్రోసిస్‌ను తగ్గిస్తాయి

TV9 Telugu

ఆల్కహాల్, టాక్సిన్స్ లేదా కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే నష్టం నుంచి కాలేయ కణాలను రక్షిస్తాయి. అంతేకాదు కాఫీని క్రమం తప్పకుండా తాగేవారికి కాలేయ క్యాన్సర్, ముఖ్యంగా హెపాటోసెల్యులార్ కార్సినోమా వచ్చే ప్రమాదం 40% తక్కువగా ఉంటుంది 

TV9 Telugu

కాఫీలోని వివిధ సమ్మేళనాలు కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి,కణాలను మరమ్మతు చేయడానికి సహాయపడతాయి. బ్లాక్ కాఫీ కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. జీవక్రియను సక్రమంచేసి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది

TV9 Telugu

రోజుకు 2-4 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం కాలేయ ఆరోగ్యానికి మంచిది. అదే రోజుకు 4-5 కప్పుల కంటే ఎక్కువ తాగితేమాత్రం విశ్రాంతి లేకపోవడం, నిద్రలేమి, ఇతర సమస్యలు తలెత్తవచ్చు