మన చుట్టూ ఎన్నో ఆరోగ్య సమస్యలకు నివారణలుగా పనిచేసే చెట్లు, మొక్కలు చాలానే ఉన్నాయి. కానీ మనం వాటిని విస్మరిస్తాం. అలువంటి వాటిల్లో ముఖ్యమైనవి అంజీర్ పండ్లు
TV9 Telugu
బలహీనంగా ఉన్నవారు అంజీర్ తింటే.. కొన్ని రోజుల్లోనే ఆశించిన మార్పు వస్తుంది- అంటారు డాక్టర్లు. ఎందుకంటే.. అంజీర్‌లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
పీచు, ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, జింక్, ఫొలేట్, రిబోఫ్లేవిన్, భాస్వరం విస్తారంగా ఉన్నాయి మరి
ఊపిరితిత్తుల్లో సమస్యలు, శ్వాసలో ఇబ్బందులను తొలగిస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది. పైల్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది
TV9 Telugu
అంజీర్ పండ్లే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి బోలెడంత మేలు చేస్తాయి. వీటిల్లో అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంజీర్ ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి
TV9 Telugu
మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా అంజీర్ ఆకులను తింటే ఇన్సులిన్ అవసరం తగ్గుతుంది. అంజీర్ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం ఉన్న ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి
TV9 Telugu
అంజీర్ ఆకులు సహజ మూత్రవిసర్జన మందుగా పనిచేస్తాయి. మూత్ర నాళం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంజీర్ ఆకుల రసం దాని ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌ల కారణంగా మొటిమలను తొలగించగలవు