పండినవేకాదు.. పచ్చి అరటి పండ్లు ఎప్పుడైనా తిన్నారా?

19 September 2025

TV9 Telugu

TV9 Telugu

తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో అరటి పండ్లకు మించిన ప్రత్యామ్నయం లేదు. ఏడాది పొడవునా దొరికే అరటి పండు తినడం వల్ల లెక్కకుమించి ప్రయోజనాలున్నాయి

TV9 Telugu

అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, రిబోఫ్లేవిన్‌, ఫొలేట్‌, కాపర్‌, పీచు, బి6, సి-విటమిన్ల వంటి పోషకాలు అధికంగా ఉంటాయి

TV9 Telugu

పండినవే కాదు పచ్చి అరటిపండ్లలో పోషకాల గురించి మీరెప్పుడైనా విన్నారా? వీటిని తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరీ

TV9 Telugu

పచ్చి అరటి పండ్లను నేరుగా తినలేం. అందుకే వాటిని అరటి పల్యా, సాంబార్, అరటి చిప్స్, బజ్జీ, బోండా వంటి వివిధ రుచికరమైన వంటకాలను తయారు చేసుకుని తింటుంటాం

TV9 Telugu

పచ్చి అరటి పండ్లలో కూడా విటమిన్ B6, పొటాషియం, ఫైబర్, ఖనిజాలు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గించడంలో, బరువు నిర్వహణలో సహాయపడుతుంది

TV9 Telugu

అరటిపండ్లలో స్టార్చ్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అరటిపండ్లలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

TV9 Telugu

పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పచ్చి అరటి పండ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది

TV9 Telugu

ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ నొప్పి, వాపులను తగ్గించి.. మొత్తంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను క్రమబద్ధం చేస్తుంది. మూత్రపిండాల్లో సమస్యలను నివారిస్తాయి