షుగర్‌ వ్యాధి ఉన్న వారు సపోటా తినొచ్చా..

12 May 2025

TV9 Telugu

TV9 Telugu

సపోటా పండు చూడగానే నోరూరుతుంది. తియ్యటి గుజ్జు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇది రుచికరమే కాదు బోలెడు పోషకాలనూ అందిస్తుంది. అవేంటంటే..

TV9 Telugu

ఈ పండులో ఇనుము, పోటాషియం, కాపర్‌, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, పీచు పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల సపోటాల నుంచి 98 కెలొరీల శక్తి లభిస్తుంది

TV9 Telugu

దోసకాయ, పుచ్చకాయ, మామిడితో పాటు, వేసవిలో సపోటా తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

సపోటాలో ఫైబర్ సరైన పరిమాణంలో లభిస్తుంది. ఇది పేగు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో కేలరీలు, చక్కెర అధిక పరిమాణంలో ఉంటాయి

TV9 Telugu

సపోటాలో విటమిన్ సి, రాగి అధికంగా ఉంటాయి. ఈ రెండూ రోగనిరోధక శక్తి పనితీరును రెట్టింపు చేస్తాయి. ఇది ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి

TV9 Telugu

చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడానికి సపోటాలోని పోషకాలు బలేగా ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది

TV9 Telugu

సపోటాను స్మూతీ, జామ్, జెల్లీ, కేక్ వంటి ఇతర అనేక మార్గాల్లో తీసుకోవచ్చు. కానీ పరిమిత పరిమాణంలో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

ఎందుకంటే ఇందులో చక్కెరశాతం అధికంగా ఉంటుంది. అందువల్ల  అలెర్జీ, మధుమేహం, కడుపు సమస్యలు వంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్న వారు దీనిని తినకుండా ఉండాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్య నిపుణుడిని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి