కీరదోసతో కోరినన్ని లాభాలు.. రోగాలన్నీ పరార్!

14 September 2025

TV9 Telugu

TV9 Telugu

కీరదోస తెలియని వారుండరు. ఇందులో సోడియం, పీచు, కాపర్, పొటాషియం, మాంగనీస్, భాస్వరం, మెగ్నీషియం, ఎ, బి1, సి, కె విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయి

TV9 Telugu

95 శాతం నీరే ఉంటుంది కనుక డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు. కీరదోస తినడం వల్ల జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి

TV9 Telugu

రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. వృద్ధులు తరచూ తినడం అలవాటు చేసుకుంటే హైపర్‌టెన్షన్‌ బారిన పడరు

TV9 Telugu

బరువు తగ్గాలనుకునేవారికి ఇదెంతో ఉపయోగం. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, ముడతలు రావు. కంటిచూపు మెరుగవుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది

TV9 Telugu

అల్జీమర్స్‌ బారిన పడకుండా కాపాడుతుంది. కీరదోసలోని సి-విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కె-విటమిన్‌ ఎముకలు, దంతాలకు దృఢత్వాన్ని తెస్తుంది

TV9 Telugu

ఇందులో యాంటీక్యాన్సర్‌ గుణాలు ఉన్నందున క్యాన్సర్లను నివారిస్తుంది. కీరదోస పిల్లలూ, పెద్దలూ అందరికీ మంచిది. ఇందులో ఉన్న సిలికా కురులను, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది

TV9 Telugu

వేడిని పోగొట్టి సేదతీర్చడంలో కీర దోస అమోఘం. ఇందులో అధికశాతం నీరు ఉంటుంది కనుక ఈ కాలంలో ఎదురయ్యే డీహైడ్రేషన్‌ సమస్యను నివారిస్తుంది

TV9 Telugu

ఇన్ని రకాలుగా మేలు చేసే కీరదోస నోటికి హితవుగానూ ఉంటుంది. దీన్ని నేరుగా తినొచ్చు, జ్యూస్, సలాడ్‌ రూపంలోనూ తీసుకోవచ్చు