చిటికెడు కుంకుమపువ్వుతో బోలెడన్ని లాభాలు.. ఖరీదైందని లైట్ తీసుకోకండి

09 December 2024

TV9 Telugu

TV9 Telugu

కొన్ని రకాల స్వీటుల్లో కుంకుమపువ్వు వేస్తుంటాం కదా! అది రుచి కోసమా, ఆరోగ్యం కోసమా అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. ఇది చాలా కదా వేయకపోతేనేం అనిపించడమూ సహజమే

TV9 Telugu

అవును.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నిజానికి, కుంకుమపువ్వు పూలవాసన, కస్తూరి పరిమళంతో కొంచెం తియ్యగా, కొంచెం ఘాటుగా ఉంటుంది

TV9 Telugu

తెలిసీ తెలియనట్టుగా కాస్తంత చేదు కూడా ఉంటుంది. దీనిలో కెలొరీలు విస్తారంగా ఉండటమే కాదు, పీచు, ప్రొటీన్లు, సి-విటమిన్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. కుంకుమపువ్వు కంటిచూపును మెరుగుపరుస్తుంది

TV9 Telugu

రక్త పోటును, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఆకలి మంట, తాపం వంటి ఇబ్బందులను నివారిస్తుంది. ఉబ్బసం, హైపర్‌టెన్షన్, మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

TV9 Telugu

అందుకే దీనిని వివిధ రకాల ఆహారాల నుంచి పాలు, వివిధ రకాల స్వీట్లను తయారు చేయడం వరకు ప్రతిదానిలో ఉపయోగిస్తారు. కుంకుమపువ్వులో క్రోసిన్, క్రోసెటిన్ వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి

TV9 Telugu

కుంకుమపువ్వును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గించుకోవచ్చు.  కుంకుమపువ్వులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి

TV9 Telugu

కుంకుమపువ్వు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి. ఇది చర్మంపై ముడతలు, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది

TV9 Telugu

నిద్రలేమిని, మానసిక సమస్యలను నివారిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం నిరోధిస్తుంది. కుంకుమపువ్వు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీన్ని అతి కొద్ది మొత్తంలో మాత్రమే ఉపయోగించాలి