చిన్న గింజల వెనుక ఇంత పెద్ద కథనా.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు..

Krishna

 02 July  2026

గుమ్మడి గింజలలో మెగ్నీషియం, జింక్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, అలాగే శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

పోషకాల గని

ఈ గింజలను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.

గుండె - మానసిక ఆరోగ్యం

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. అలాగే పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇది తోడ్పడుతుంది.

సంతానోత్పత్తి

మీరు ప్రతిరోజూ తాగే స్మూతీలలో గుమ్మడి గింజలను కలపడం ద్వారా వాటి పోషక విలువలు పెరుగుతాయి. ఇవి స్మూతీలకు మంచి క్రీమీ ఆకృతిని, అద్భుతమైన రుచిని ఇస్తాయి.

స్మూతీలలో

ఉదయం పూట తినే అల్పాహారంలో లేదా చిరుతిండిగా పెరుగు, మజ్జిగ, ఓట్‌మీల్‌లలో గుమ్మడి గింజలను కలుపుకుని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

పెరుగు, ఓట్‌మీల్‌

గుమ్మడి గింజలను, ఎండిన పండ్లు, చాక్లెట్‌ ముక్కలతో కలిపి ఒక హెల్తీ ట్రైల్ మిక్స్ తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పూట తినడానికి ఇది ఒక అద్భుతమైన హెల్తీ స్నాక్.

ట్రైల్ మిక్స్

కూరగాయల లేదా పండ్ల సలాడ్స్‌పై ఈ గింజలను చల్లుకోవడం ద్వారా మంచి క్రంచీ రుచి వస్తుంది. అలాగే ఇంట్లో పెస్టో సాస్ తయారు చేసేటప్పుడు పైన్ నట్స్‌‌కు బదులుగా గుమ్మడి గింజలను వాడితే పోషకాలు మరింత పెరుగుతాయి.

సలాడ్స్, పెస్టో సాస్

ఇకపై మీ ఇంట్లో గుమ్మడికాయతో ఏ వంటకం చేసినా, అందులోని గింజలను పారేయకుండా జాగ్రత్తగా సేకరించి, భద్రపరుచుకోండి. వాటిని ఆహారంలో భాగంగా చేసుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.

వృధా చేయకండి