ఒక్క జామకాయతో ఆ రోగాలన్నీ.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు..

Krishna

 07 July  206

జామకాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం

జామకాయల్లో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఒక్క జామకాయ తిన్నా మన శరీరానికి రోజుకు కావలసిన ఫైబర్‌లో 12శాతం లభిస్తుంది. ఇది ప్రేగుల కదలికలను సులువుగా మార్చి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

జీర్ణక్రియ మెరుగు

జామ ఆకుల రసం రక్తంలో చక్కెర స్థాయిలను అద్భుతంగా నియంత్రిస్తుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను మెరుగుపరుస్తుంది. భోజనం చేసిన తర్వాత జామ ఆకుల టీ తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

 షుగర్ లెవెల్స్

బరువు తగ్గాలనుకునే వారికి జామకాయ ఒక అద్భుతమైన స్నాక్. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా ఇందులో ఉండే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయకుండా పొట్ట నిండిన అనుభూతిని ఇస్తుంది.

బరువు తగ్గడం

చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే తీవ్రమైన కడుపునొప్పి, తిమ్మిరి సమస్యకు జామ ఆకుల రసం మంచి ఔషధంగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో జామ ఆకుల రసం తాగితే నొప్పి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.

పీరియడ్స్ నొప్పి

జామ ఆకుల రసంలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ను తగ్గించడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి

క్యాన్సర్ నిరోధకం

శరీరంలో విటమిన్ సి లోపిస్తే ఇన్ఫెక్షన్లు, రోగాలు త్వరగా దాడి చేస్తాయి. ఒక నారింజ కంటే ఒక జామకాయలో 4 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

రోగనిరోధక శక్తి

జామకాయల్లో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మంచి గ్లో ఇస్తాయి. ఇవి ముడతలను ఆలస్యం చేసి చర్మాన్ని యవ్వనంగా మార్చుతాయి. అలాగే జామ ఆకుల రసాన్ని చర్మంపై అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి.

చర్మాన్ని యవ్వనంగా