డ్రైఫ్రూట్స్ విషయంలో చాలామందికి వివిధ అపోహలుంటాయి. ఇవి తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని, ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుందని కొంతమంది భావిస్తారు
TV9 Telugu
అయితే ప్రత్యేకించి బాదం విషయంలో ఈ అపోహలన్నీ సరికాదంటున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండానే, శరీరానికి ఉపయోగపడే ఇతర ప్రయోజనాలు పొందాలంటే బాదం తినేటప్పుడు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు
TV9 Telugu
నిజానికి, బాదం చర్మం, ఫిట్‌నెస్, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంలో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండడమేకాకుండా ఇందులో విటమిన్ 'ఇ', పీచు.. వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
అయితే బాదం ఆరోగ్యానికి మేలు చేయాలంటే వాటిని తినేటప్పుడు ఈ విధమైన తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
బాదంపప్పును ఎల్లప్పుడూ నానబెట్టి మాత్రమే తినాలి. తినడానికి ముందు పొట్టు తీసేస్తే మంచిది. చాలా మంది తొక్కతో పాటు నానబెట్టకుండానే తింటుంటారు. దాని వల్ల పూర్తి ప్రయోజనం పొందలేరు
TV9 Telugu
చాలా మంది బాదంపప్పును నూనెలో లేదా నెయ్యిలో వేయించి మసాలా దినుసులు వేసి తింటారు. ఇలా చేస్తే మరింత కరకరలాడుతూ, రుచిగా మారవచ్చు. కానీ ఈ పొరపాటు చేయకూడదు. ఇలా తింటే శరీరంలో కొవ్వు చేరి బరువు పెరుగుతారు
TV9 Telugu
చాలా మంది తమ రోజువారీ దినచర్యలో బాదంపప్పును తినరు. అప్పుడప్పుడు మాత్రమే తింటుంటారు. కానీ సరైన ప్రయోజనాలను పొందడానికి, బాదంను రోజూ పరిమిత పరిమాణంలో తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
బాదం పప్పును నిల్వ చేసేటప్పుడు చాలా మంది చేసే పొరబాటు.. బాదం పప్పులను చాలా వేడిగా లేదా చాలా తేమగా ఉండే ప్రదేశంలో ఉంచడం. దీని కారణంగా బాదం వాటి సహజ పోషకాలను కోల్పోతుంది. అలెర్జీ వంటి కొన్ని వ్యాధుల విషయంలో బాదం తినక పోవడమే మంచిది