సాయి పల్లవి దర్శత్వంలో చైతూ సినిమా.!
Prudvi Battula
11 February 2025
సాయి పల్లవి తన నాచురల్ యాక్టింగ్‌తో ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తుంది. తన సింప్లిసిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
సాధారణ అమ్మాయిలా కనిపిస్తూనే వెండితెరపై మాయా చేస్తుంది. సహజ నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటుంది.
తాజాగా నాగ చైతన్యకి జోడిగా నటించిన తండేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈమె సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
ఈ క్రమంలోనే నాగ చైతన్య లీక్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్‌తో ఇప్పుడు ఈ నాచురల్ బ్యూటీ నెట్టింటా తెగ ట్రెండ్ అవుతుంది.
ఇటీవల తండేల్ ప్రమోషన్స్‌లో సాయి పల్లవి చైతు ఇద్దరూ వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలోనే సాయి పల్లవిని ఉద్దేశిస్తూ మీరెప్పుడైనా సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందా అని ఓ అభిమాని అడిగాడు.
వెంటనే లేదు అంటూ ఆమె ఆన్సర్ ఇచ్చినప్పటికీ నాగ చైతన్య మాత్రం ఆమె డైరెక్టర్ అవ్వాలని అనుకుంటుందని, అందులో ఓ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు చెప్పారు.
దీనికి సాయి పల్లవి కూడా అవును అన్నట్టు నవ్వడంతో త్వరలో డైరెక్టర్‌గా మారుతుందనే టాక్ నెట్టింటా వైరల్ అవుతోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కాంచన 4 కోసం ఇద్దరు క్రేజీ భామలు.. ఎవరా హీరోయిన్స్.?
నార్త్ సినిమాల్లో సౌత్ హీరో పక్కా.. ఇదే నయా ట్రెండ్..
ఓదెల 2 రూట్లో మంగళవారం సీక్వెల్.. పాయల్ అవుట్..