కాంచన 4 కోసం ఇద్దరు క్రేజీ భామలు.. ఎవరా హీరోయిన్స్.?

Prudvi Battula 

10 February 2025

రాఘవ లారెన్స్ కెరీర్‌ మొత్తం తెలియని ఈ జనరేషన్‌ పిల్లలకు కూడా కాంచన సినిమా సీరీస్‌ మీద అవగాహన ఉంటుంది.

ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ సిరీస్ సౌత్‌లోనే కాదు, ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌ అయిన కాన్సెప్ట్ కాంచన.

కాస్త భయపెడుతూ, ఇంకాస్త థ్రిల్‌ పంచుతూ, మరికాస్త, నవ్వులు కురిపిస్తూ సాగిన ఈ కాన్సెప్ట్‎కి బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిసింది.

లేటెస్ట్‎గా కాంచన ఫోర్త్ చాప్టర్‌ని ప్లాన్‌ చేస్తున్నారు రాఘవ లారెన్స్. ఈ చిత్రంలో ఆయనతో పూజా హెగ్డే జోడీ కడతారనే వార్త గత కొన్నాళ్లుగా హల్‌చల్‌ చేస్తూనే ఉంది.

ఆల్రెడీ రెట్రోతో తమిళనాడులో మళ్లీ పాపులారిటీ సంపాదించుకునే పనిలో ఉన్నారు పూజా. కాంచన సినిమాకు ఆల్రెడీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారన్నది వార్త.

అయితే కాంచన మూవీలో పూజా మాత్రమే హీరోయిన్‌ కాదట. నార్త్ బ్యూటీ నోరా ఫతేహీని కూడా లారెన్స్ అప్రోచ్‌ అయ్యారన్నది లేటెస్ట్ టాక్‌.

సౌత్‌ సినిమాలు అనగానే జస్ట్ డ్యాన్సుల మీదే దృష్టి పెట్టేవారు నోరా. కానీ ఇప్పుడు స్టైల్‌ మార్చారు. ఆల్రెడీ ఆమె పవర్‌స్టార్‌ సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పుడు లారెన్స్‎కి ఓకే చెప్పారు. అంటే నోరా ఇకపై జస్ట్ స్పెషల్‌ సాంగులే కాదు, పర్ఫెక్ట్ కేరక్టర్లలో కనిపించడానికి కూడా రెడీ అవుతున్నారన్నమాట.