జనవరిలో హీరోయిన్లు ఫుల్‌ ఖుషీ.. గ్లామర్‌‎కి ఆడియన్స్ ఫిదా.. 

Prudvi Battula 

10 February 2025

క్రిష్‌ నెక్స్ట్ చాప్టర్‌కి బడ్జెట్‌ పెట్టలేకపోతున్నారా? అత్యంత భారీ బడ్జెట్‌లు పెట్టే బాలీవుడ్‌కి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నట్టు? ఇప్పుడు ఇదో హాట్‌ టాపిక్‌.

మేకింగ్‌ పరంగా రాజీ పడలేం, ఒకవేళ అంతంత పెట్టి సినిమాలు తీసినా మార్కెట్‌ పరిస్థితి ఎలా ఉంటుందోననే ఊగిసలాట.. అంటూ సిట్చువేషన్‌ని డిస్‌క్రైబ్‌ చేస్తున్నారు క్రిటిక్స్.

సోలోగా వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే, వర్కవుట్‌ కాకపోతే నిండా మునిగిపోయే పరిస్థితి ఉంది. అందుకే సౌత్‌ హీరోలను కలుపుకుని సినిమాలు తెరకెక్కించాలన్నది ముంబై మేకర్స్ స్ట్రాటజీ.

ఇప్పుడు వార్‌2 కూడా అలాంటి సబ్జెక్టే. నార్త్ హృతిక్‌, మన తారక్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద భీభత్సమైన ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

సౌత్‌, నార్త్ పక్కా కొలాబరేషన్‌ ఉంటే మార్కెట్‌ పరంగానూ, ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగానూ మేకర్స్ సేఫ్‌ జోన్‌లో ఉంటారు.

అందుకే ఇప్పుడు ఈ ఫార్ములాని ఎక్కువగా ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు. ఆ మధ్య బ్రహ్మాస్త్రలో కింగ్‌ నాగ్‌కి ది బెస్ట్ రోల్‌ ఇవ్వడం వెనుక రీజన్‌ కూడా ఇదే.

ఆల్రెడీ కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాలో వెంకటేష్‌తో కలిసి నటించారు సల్మాన్‌ ఖాన్‌. త్వరలోనే ఆయన రజనీకాంత్‌తో కలిసి అట్లీ సినిమాలో నటిస్తారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

సౌత్‌తో మింగిల్‌ కావడానికి సల్మాన్‌ ఎప్పుడూ వెనక్కి తగ్గరు. మెగాస్టార్‌ మూవీలో టార్ మార్‌ టక్కర్‌ మార్‌ అంటూ స్టెప్పులు కూడా వేశారు సల్లూభాయ్‌.