ఓదెల 2 రూట్‎లో మంగళవారం సీక్వెల్.. పాయల్ అవుట్.. 

Prudvi Battula 

10 February 2025

సంపత్‌ నంది కథతో ఓదెల రైల్వేస్టేషన్‌ సినిమాకు హెబ్బా పటేల్‌ నటిస్తున్నారన్నది తప్పితే, ఇంకేం బజ్‌ లేదు ఓపెనింగ్‌ రోజు.

కానీ గ్రామంలో వరుస హత్యల వెనకున్నదెవరు? అనే కాన్సెప్ట్ థియేటర్లకు జనాలను రప్పించింది. మంచి కంటెంట్ కారణం బ్లాక్ బస్టర్ అయింది.

ఓదెల రైల్వేస్టేషన్‌ సక్సెస్‌ కావడంతో ఇమీడియేట్‌గా సెకండ్‌ పార్టును స్టార్ట్ చేశారు. ఫస్ట్ పార్టుకు, సెకండ్‌ పార్టుకు ఏ మేరకు కనెక్షన్‌ ఉంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

తమన్నా నటిస్తున్న ఓదెల 2 మీద మంచి హైపే క్రియేట్‌ అయింది. ఫస్ట్ పార్టులో నటించిన హెబ్బాను కాదని, సెకండ్‌ పార్టుకు బడ్జెట్‌ పెంచి తమన్నాను తీసుకున్నారు మేకర్స్.

ఇప్పుడు మంగళవారం మూవీకి కూడా ఇదే జరుగుతుందన్నది టాక్‌. పాయల్‌ రాజ్‌పుత్‌తో తెరకెక్కించిన మంగళవారం యూత్‌ని యమాగా ఆకట్టుకుంది.

డిఫరెంట్‌ కాన్సెప్ట్‎తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్‌కి ఇప్పుడు సీక్వెల్‌ చేసే ప్లాన్స్‎లో ఉన్నారు మేకర్స్. సెకండ్‌ చాప్టర్‌ కోసం బాలీవుడ్‌ భామ కృతి సనన్‌ని అప్రోచ్‌ అవుతున్నారన్నది టాక్‌.

ఆమెతో పాటు మరో హీరోయిన్‌ని కూడా ఉండే అవకాశం ఉంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ ప్రాజెక్ట్ ప్లాన్‌ చేస్తున్నారు.

ఓదెల2, మంగళవారం సీక్వెల్‌ బాక్సాఫీస్‌ దగ్గర బంపర్‌గా ఆడితే తప్పకుండా ఫ్యూచర్‌లో ఈ సంప్రదాయం కంటిన్యూ అయ్యే ఛాన్సులు బాగా కనిపిస్తున్నాయి.