కృతి అక్కడే సెటిల్ అవుతుందా.?
21 March 2025
Prudvi Battula
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ కృతి శెట్టి. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
తొలి సినిమాతోనే వందకోట్ల వసూళ్లు రాబట్టి ఈ చిన్నది సెన్సేషన్ గా మారిపోయింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.
ఉప్పెన సినిమా తర్వాత ఈ చిన్నది చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు కూడా హిట్ అయ్యాయి.
దాంతో లక్కీ బ్యూటీగా మారిపోయింది కృతి శెట్టి.. కానీ ఆ తర్వాత ఈ భామ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి.
వరుసగా కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. కొన్ని వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు.
దాంతో కృతి శెట్టికి ఆఫర్స్ మెల్లగా తగ్గుతూ వచ్చాయి. చివరిగా శర్వానంద్ తో చేసిన మనమే సినిమా కూడా అందుకోలేకపోయింది.
అయితే మలయాళంలోకి అడుగుపెట్టి అక్కడ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. అదే గత ఏడాది వచ్చిన ఏఆర్ఎం. ఇది భారీ విజయాన్ని అందుకుంది.
అలాగే తమిళంలో వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జినీ అనే మూడు సినిమాలు చేస్తోంది ఈ ముడుగుమ్మ. దింతో ఇక్కడ సెటిల్ అవుతుంది అనుకుంటున్నారు అంత.
మరిన్ని వెబ్ స్టోరీస్
సామ్ టెన్త్ మార్క్స్ ఎంతంటే.?
నన్ను అలా పిలవడం నచ్చదు: శ్రీలీల..
ఆ పనే చేసేవాడిని: హీరో నాని..