బన్నీ ఆఫీసులో తనకి హిట్ ఇచ్చిన దర్శకుడు ఫోటో.. ఎవరా డైరెక్టర్.?
24 March 2025
Prudvi Battula
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 ది రూల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గత ఏడాది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 నాలుగో ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వెళ్ళాడు.
ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు అల్లు అర్జున్.
అలాగే తన సినిమా కెరీర్ కు దోహదం చేసిన సినీ ప్రముఖులు, డైరెక్టర్లతో తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
ఈ సందర్భంగా తనకు గంగోత్రి లాంటి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవేంద్రరావు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బన్నీ.
'నా ఆఫీస్ లోకి ఎవరైనా వస్తే ఫస్ట్ కనపడేది రాఘవేంద్రరావు గారి ఫోటోనే. దాని కింద నా ఫస్ట్ డైరెక్టర్ అని రాసి ఉంటుంది'.'
' నా మనసులో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. చిన్నప్పుడు నేను డ్యాన్సులు వేస్తుంటే ఆయనే నన్ను పిలిచి 100 రూపాయలు ఇచ్చారు'.
'ఆ తర్వాత రాఘవేంద్ర రావుగారే నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి నన్ను హీరోని చేశారు' అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్'.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇన్ఫ్లుయెన్సర్ టు హీరోయిన్స్.. ఎవరా ముద్దుగుమ్మలు.?
జీవితంలో పెళ్లి చేసుకోను: ఐశ్వర్య లక్ష్మీ..
గీతగోవిందంలో హీరోయిన్గా తొలి ఎంపిక ఆమెనే..