ఒటీటీ రైట్స్‌లో టాప్ సినిమాలివే..ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న హీరో ఎవరంటే?
Samatha
20 January 2025
కరోనా తర్వాత నుంచి ఓటీటీ చిత్ర పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇది మంచి సపోర్ట్ అందిస్తుంది.
చాలా మంది థియేటర్లలో చూడని సినిమాలను ఇంటి వద్దే ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో వీక్షిస్తున్నారు. అయితే ఈ ఓటీటీకి సంబంధించిన ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇండియాలో టాప్ రేట్‌కు అమ్ముడు పోయిన సినిమాలేవి? అందులో ఏ హీరో మొదటి స్థానంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలోనే అత్యధికంగా ఓటీటీ రైట్స్‌కు అమ్ముపోయిన సినిమా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ, అలాగే మొదటి స్థానంలో ఉన్న హీరో కూడా ఈయనే.
కల్కి మూవీని రూ.375 కోట్లతో అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. దీంతో ఇదే మొట్ట మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ మూవీ విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టింది.
కన్నడ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్2 రెండో స్థానంలో ఉంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ రూ.320 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మూవీతో ప్రపంచానికి కన్నడ సినిమా పరిచయం అయ్యిందనే చెప్పవచ్చు.
మూడో స్థానాన్ని త్రిబుల్ ఆర్ దక్కించుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన `విషయం తెలిసిందే.
ఈ మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ రూ. 300కోట్లకు కొనుగోలు చేసింది. ఇక నాలుగో స్థానంలో పుష్ప2 రూ.275 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.