ఈ ముద్దుగుమ్మలు నిర్మాతలు కూడా.. 

02 March 2025

Prudvi Battula 

నిత్యం వార్తల్లో నిలిచే అమలాపాల్‌ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అమలాపాల్ ప్రొడక్షన్స్ పేరిట అడాయ్, అధో అంధా పరవాయి పోలాలు సినిమాలను తెరకెక్కించింది.

నటిగా కెరీర్ మొదలు పెట్టి నిర్మాతగా మారిన నటీమణుల్లో ఛార్మీ ఒకరు. పూరీ జగన్నాథ్‌తో కలిసి నిర్మాతగా మారి ఈస్మార్ట్‌ శంకర్‌ లైగర్‌తో పాటు డబల్ ఇస్మార్ట్ సినిమాలు తీసింది.

జ్యోతిక సైతం నిర్మాతగా మారి భర్త సూర్య ప్రారంభించిన 2D ఎంటర్‌టైన్మెంట్స్‌కు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన జై భీమ్‌ మంచి నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.

సౌత్ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార సైతం రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‎తో కలిసి కో ప్రొడ్యూసర్‌గా మారారు. భర్త విగ్నేష్‌ శివన్‌తో కలిసి పలు సినిమాలు నిర్మించింది.

తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే కన్నడ బ్యూటీ నిత్యామేనన్‌ స్కైల్యాబ్ చిత్రంతో నిర్మాతగా మారింది. ఈ సినిమాలో నిత్యా నటించిందీ కూడా.

మెగా హీరోయిన్‌ నిహారిక సైతం పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్టార్ట్ చేసి ముద్ద పప్పు ఆవకాయ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో పాటు బ్లాక్ బస్టర్ కమిటీ కుర్రాళ్ల సినిమాలు నిర్మించింది.

మలయాళ బ్యూటీ నజ్రియా సైతం నిర్మాతగా మంచి సక్సెస్‌ను అందుకుంది. నజ్రియా నజీమ్ ప్రొడక్షన్స్ అని బ్యానర్ స్టార్ట్ చేసి పలు సినిమాలను తెరకెక్కించింది.

బాలీవుడ్‌లో వరుస విజయాలు అందుకొని నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి తాప్సీ సైతం ప్రొడక్షన్‌ రంగంలోకి అడుగు పెట్టింది. బ్లర్ర్ సినిమాతో నిర్మాతగా మారింది.