టీనేజ్‌లోనే హీరోయిన్స్‌గా మారిన ముద్దుగుమ్మలు వీరే?

samatha.j

26 January 2025

Credit: Instagram

అతి చిన్న వయసులో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా మంచి స్టేస్ అందుకున్నారు కొందరు బ్యూటీస్.

కాగా,  టీనేజ్ లోనే టాలీవుడ్ లో‌కి ఎంట్రీ ఇచ్చి తన గ్లామర్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో మంచి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

 తర్వాత 16 ఏళ్ల వయసులోనే ఈ బ్యూటీ ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిది. కానీ హీరోయిన్‌గా ఈ అమ్మడు అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది.

కొత్త బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ శ్వేత బసు ప్రసాద్. ఎక్కడా.. అనే డైలాగ్‌తో ఈ బ్యూటీ ఫేమస్ అయ్యింది. కాగా ఈమె 17 ఏళ్ల వయసులోనే  సినిమాల్లోకి అడుగు పెట్టింది.

15 ఏళ్ల వయసులోనే  టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ చార్మి కౌర్ చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈమె ప్రస్తుతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

  ఉప్పెన మూవీతో కుర్రకారు డ్రీమ్ గర్ల్ ‌గా మారిన కృతిశెట్టి 17   ఏళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి,  మొదటి సినిమాతోనే  బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది.

హన్సిక, మిల్కీ బ్యూటీ తమన్నా  15 ఏళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇక తన అందం తో అందరినీ ఆకట్టుకొని, స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.