ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారులు.. టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోలు!
samatha
1 march 2025
Credit: Instagram
ఒకరి చేతిలో బాల్, మరొకరు బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ చిన్నారులు ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న క్రేజీ హీరోస్. నటీనటులకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.
తాజాగా పాన్ ఇండియా రేంజ్‌లో మంచి బజ్ సంపాదించుకున్న హీరో, అలాగే తన సినిమాలతో టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటున్న యంగ్ హీరో ఉన్నారు.
ఇంతకీ వారెవరు అనుకుంటున్నారా? అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న విజయ్ దేవరకొండ, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చాలా చిత్రల్లో చిన్న క్యారెక్టర్స్ చేసి, పెళ్లి చూపులు సినమాతో మంచి ఫేమ్ సంపాదించున్నాడు విజయ్ దేవరకొండ.
తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు, ఈ మూవీ హిట్ తర్వాత రౌడీ హీరో వెనక్కి తిరిగి చూసుకోకుండా వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతున్నాడు.
ఇక ఇటీవల ఈ హీరో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అందుకున్నా, యూత్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు.
గీతాగోవిందం, టాక్సీ వాలా, లైగర్, ఖుషి, డియర్ కామ్రెడ్ వంటి చాలా సినిమాల్లో ఈయన తన నటనతో తెలుగ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.
ఇక ఆనంద్ దేవరకొండ దొరసాని వంటి చాలా సినిమాల్లో నటించారు. బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ పలు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు.