యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఇక మొదటి సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, ఈ యంగ్ బ్యూటీకి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో శ్రీలీల తన గ్లామర్‌తో అందరి మనసు దోచేసింది.
పెళ్లిసందడి తర్వాత ధమాకా, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో మెరిసింది ఈ బ్యూటీ.
కానీ శ్రీలీల చేసిన మూవీస్ చాలా వరకు ఫ్లాప్ కావడంతో, ఈ బ్యూటీ కెరీర్ కాస్త డౌన్ ఫాలో అయ్యిందనే చెప్పవచ్చు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో విజయ్ దేవరకొండ 12 మూవీ, ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒక రాజు సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తతం ఈ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ వరస ఫొటో షూట్స్ చేస్తూ.. తన గ్లామర్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. కానీ ఈ బ్యూటీ ఈ సారి చీరలో అందంగా దర్శనం ఇచ్చింది.
గోల్డ్ కలర్ చీరలో అందంగా ముస్తాబై, తన క్యూట్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఫొటోస్ చూసిన ఈ అమ్మడు అభిమానులు చీరలో శ్రీలీల చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్ అంటూ కామెట్స్ చేస్తున్నారు.