సోనాలి బింద్రే గురించి ప్రత్యక పరిచయం అవసరం లేదు.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన సోనాలి బింద్రే.. తరువాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టి అనేక హిట్ సినిమాల్లో నటించింది.
తెలుగు లో హీరోయిన్ గా చేసిన ప్రతి సినిమా మంచి విజయాలు సాధించినచాయి. మన్మధుడు, ఖడ్గం, మురారి, శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి
ఇది ఇలా ఉంటే ఈ మధ్యనే క్యాన్సర్ తో సతమతమైన ఈ హీరోయిన్.. కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక స్టార్ హీరో గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది సోనాలి బింద్రే. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో నటించేటప్పుడు.. ఆయన తనను చాలా చిరాగ్గా చూసే వాడని.. మొహం చిట్లించుకొని చూసేవారని తెలిపింది సోనాలి.
దాంతో అతనిని తిట్టాలి అనిపించేది.. అయితే రోజులు గడిచే కొద్దీ సల్మాన్ ఖాన్ గురించి అర్థమైందని.. ఆయన పైకి కనిపించేనంత కఠినాత్ముడు కాదు అని.. లోపల చాలా సాఫ్ట్ అర్ధమైంది అప్పటి నుంచి ఆయనపై అభిమానం పెరిగిందట.