ఆ ఇద్దరి స్టార్ డైరెక్టర్స్ తో.. కోర్ట్ బ్యూటీ శ్రీదేవి
Phani CH
05 June 2025
Credit: Instagram
కోర్ట్ సినిమా హీరోయిన్ శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మొదటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
శ్రీదేవి మన తెలుగు అమ్మాయే అన్న సంగతి అందరికి తెలిసిందే.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన విషయాలను అభిమానులకు షేర్ చేస్తుంది.
అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియా లో రీల్స్ షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నది ఈ చిన్నది.
సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిన ఈమెకు నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు సినిమాలో నటించే అవకాశం రాగా జాబిలి పాత్రలో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని, హరీష్ శంకర్ శ్రీదేవిని కలిసారని తెలుస్తోంది.
గోపీచంద్ మలినేని గారికి నేను చేసే రీల్స్ అంటే చాలా ఇష్టమని ఆయన స్వయంగా చెప్పారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది శ్రీదేవి.
అయితే వారు ప్రస్తుతం చేసే సినిమాల గురించి కాదని ఇండస్ట్రీలో నేను మరింత ఎదిగే వరకు మేము వెయిట్ చేస్తామని చెప్పినట్టు శ్రీదేవి తెలిపింది.