సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2010లో "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.
మొదటి సినిమా అయిన ఏ మాయ చేసావే తో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి డెబ్యూ అవార్డు వచ్చింది. ఆ తరువాత తెలుగు, తమిళ సినిమాలతో పాటు హిందీ వెబ్ సిరీస్‌లలోనూ నటించింది.
నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది సమంత కొన్ని మనస్పర్థలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారన్న విషయం తెలిసిందే.
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. ఇప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ మధ్య ఒక జి ఈవెంట్ కి.. అక్కినేని అమల, సమంత హాజరు కావడంతో.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ ప్రోగ్రాం లో అమలను మీ ఇంట్లో ఎవరు ఏది బాగా కుక్ చేస్తారు అని అడగగా.. నాగచైతన్య బాగా వంట చేస్తారని.. ముఖ్యంగా కాఫీ చాలా బాగా పెడతారు అని చెప్పుకొచ్చింది.
ఇక ఈ విషయం వింటూ.. సమంత నవ్వుతూ కనిపించింది. అంతేకాకుండా నాగార్జున టీ బాగా పెడతారని.. అఖిల్ బిర్యానీ బాగా చేస్తారని చెప్పుకొచ్చింది.