సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన శోభాశెట్టి.. కారణం అదే..

Phani CH

05 June 2025

Credit: Instagram

శోభా శెట్టి గురించి కొత్తగా బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ ఉన్న స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది.

 కార్తీకదీపం సీరియల్‌లో మోనిత యొక్క పాత్ర ఎంత పాపులరో మన అందరికి విదితమే. ఈ పాత్రలో నటించి అందరి మనసుల్లో నాటుకుపోయింది.

తాజాగా సోషల్ మీడియా ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చింది. కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరం కాబోతున్నాను అంటూ పోస్ట్ పెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచింది. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మడికి అవకాశాలు రావట్లేదు.

పైగా ‘కార్తీకదీపం 2’ సీరియల్ లో మళ్లీ అవకాశం వస్తుంది అనుకున్నారు కానీ అవకాశం కూడా చేజారిపోయింది. మరొకవైపు ఎంగేజ్మెంట్ అయ్యి ఏడాది అయిన పెళ్లి మాట మాత్రం ఎత్తలేదు.

అలాగే హౌస్ నుంచి బయటకు వచ్చాక బట్టల వ్యాపారం మొదలుపెట్టినట్లు వార్తలు వినిపించాయి. కానీ అది కూడా పెద్దగా సాఫీగా సాగుతున్నట్లు అనిపించడం లేదు.

ఇలా వరుసగా అనుకున్నవేవీ సాధించకపోవడంతో కాస్త నిరాశ వ్యక్తం చేసిన ఈమె అందుకే కాస్త గ్యాప్ తీసుకోవడానికి ఇటు సోషల్ మీడియాకి కూడా దూరమైనట్లు తెలుస్తోంది.