చెర్రీ, ఉపాసన ఆస్తి వివరాలు తెలిస్తే షాక్.. 

02 March 2025

Prudvi Battula 

రామ్ చరణ్, ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచేయాల్సిన పని లేదు.. 2012లో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి అందరికి తెల్సిందే.

వీరిద్దరికి టాలీవుడ్‎లో క్యూట్ కపుల్ అనే పేరు ఉంది. దీనికి కారణం ఇరువురి మధ్య  కనిపిస్తున్న ప్రేమ అభిమానులే..

దాదాపు పెళ్ళైన 10 తరువాత రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లింకారా పుట్టి మెగా ఇంటి అదృష్ట దేవతలా మారింది.

అయితే టాలీవుడ్లో అత్యంత ధనవంతులైన హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరని అందరికి తెలుసు. అయితే ఉపాసన కూడా భారీగా ఆస్తులు కలిగి ఉన్నారు.

ఇది ఇలా ఉంటే రామ్‌చరణ్-ఉపాసన జంట భారతదేశంలోని అత్యంత ధనిక సెలబ్రిటీ జంటలలో ఒకటిగా పరిగణించబడుతుంది..

రామ్‌చరణ్-ఉపాసన జంటకు దాదాపుగా 2500 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.. దీని లో ఉపాసన ఆస్తి 1,130 కోట్లు కాగా రామ్ చరణ్ ఆస్తి 1000 కోట్లు.

ఉపాసన తాత ప్రతాప్ సి.రెడ్డి నేతృత్వంలోని అపోలో హాస్పిటల్స్ మార్కెట్ విలువ దాదాపు 77,000 కోట్లు. ఈయన మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.22,000 కోట్లుగా అంచనా.

ఉపాసన తండ్రి అనిల్ కామినేని కేఈఐ అనే కంపెనీని నడపగా.. తల్లి శోభన కూడా అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.