తనే నా ప్రాణం అంటున్న సచిన్ టెండూల్కర్ కూతురు.. ఇంతకీ అతనెవరంటే? 

samatha

20 January 2025

భారత మాజీ క్రికెటర్, భారత రత్న సచిన్ టెండూల్కర్ గారాల పట్టీ సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బుట్ట బొమ్మలా కనిపించే ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకుంటూ సొంత ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ తన లైఫ్ స్టైల్, తనకు ఇష్టమైన వారి గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా తన తమ్ముడితో తనకున్న అనుబంధాన్ని తెలిపింది.

ఇటీవలే సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈ ముద్దుగుమ్మ,  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

 నాకు నా తమ్ముడు అర్జున్ అంటే చాలా ఇష్టం. తనతో ఎక్కువ సేపు గడపడానికి నేను ఇష్టపడుతాను. ముఖ్యంగా మేమిద్దరం ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం.

నా లైఫ్‌లోని ప్రతి చిన్న విషయాన్ని నేను నాతమ్ముడితో పంచుకుంటాను. అసలు మా ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు.

తనంటే నాకు ప్రాణం, వాడు నా కంటే రెండేళ్లు చిన్న వాడు, వాడు లేకపోతే అసలు నేను ఉండలేను. తనంటే నాకు అంత ఇష్టం.

ఇక అర్జున్ తనకు ఏ సందేహం వచ్చినా మొదట నన్నే అడుగుతాడు.  ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి అలకలు, కొట్లాటలు లేవకు అని చెప్పుకొచ్చింది.