నీళ్లలో జాలీ జాలిగా..వెకేషన్ ఏంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ !

samatha 

20 April 2025

Credit: Instagram

నటీనటులు ఎక్కువగా వెకేషన్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా స్టార్ హీరో గారాల పట్టీ సారా అలీ ఖాన్ తన అమ్మ, అమృత సింగ్, తమ్ముడితో కలిసి స్విట్జర్లాండ్ ట్రిప్‌కు వెళ్లింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

గ్లామర్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది అనతికాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించుకుంది.

తన గ్లామర్ తో కుర్రకారు మనసు దోచేసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఎప్పుడు కాస్త టైమ్ దొరికినా చాలు ఈ అమ్మడు వెకేషన్ వెళ్లడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటది.

ఈ బ్యూటీకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టంమంట. అందుకే ఏ కాస్త సమయం దొరికినా సరే తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కు వెళ్తుంటుంది

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన అమ్మ అమృత సింగ్, తమ్మడు ఇబ్రహీంతో కలిసి స్విస్‌కు వెళ్లి ఏంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ నటి తన ఇన్ స్టాలో షేర్ చేసింది.

సారా స్విట్జర్లాండ్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది ఫొటోస్ చూస్తేంటే. ఒక చోట తన తల్లితో కలిసి మంచు కొండల మధ్య ఫొటోలకు ఫోజులిచ్చింది. మరో చోట తన తమ్ముడితో కలిసి బ్రిడ్జ్ పై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఇంకో చోట సూర్య రశ్మి ఎంజాయ్ చేస్తూ కనిపించి, రంగు రంగుల పూల మధ్య అందంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి.