నేను ఇలా మారడానికి కారణం వారే..ఆ ఇద్దరే నన్ను చెడగొట్టారంటున్న సమంత!

samatha.j

27 January 2025

Credit: Instagram

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మకు సినీ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది.

ఇక నిత్యం ఏదో ఒక ఇష్యూతో ఈ ముద్దుగుమ్మ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కాగా, తాజాగా సామ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ అమ్మడు అనారోగ్య సమస్యలతో చాలా రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడిప్పుడే తాను కోలుకొని, వరస ఇంటర్యూలు, ఈవెంట్స్‌కు అటెండ్ అవుతూ సందడి చేస్తుంది. తాజాగా సమంత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంది.

ఆ ఈవెంట్‌లో ఈ ముద్దుగుమ్మ దర్శకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సమంత ఏం చెప్పిందో ఇప్పుడు మనం చూద్దాం.

 దర్శకులు రాజ్ అండ్ డీకేలతో కలిసి  ఫ్యామిలీమ్యాన్ 2. సిటాడెల్ హానీ బన్నీ లాంటి ప్రాజెక్స్ చేయడం వల్ల నటిగా నన్న నిరూపించుకున్నాను.

 ఇలా ఛాలెంజింగ్ పాత్రలే చేస్తాను, వీరి వల్ల నేను ప్రతి విషయాన్ని లోతుగా చూడటం నేర్చుకున్నాను, వారే నన్న ఛాలెంజ్ పాత్రల్లో నటించేలా మార్చారు.

అంతే కాదు నన్ను చెడగొట్టింది కూడా వారే అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.