బిగ్‌బాస్ హోస్ట్‌గా సమంత.. నిజమేనా.?
13 September 2025
Prudvi Battula
తెలుగులో బిగ్‌బాస్ షోకి మంచి ఆదరణ లభించింది. ఇప్పటికి 8 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో గత వారం సీజన్ 9 స్టార్ట్ అయింది.
బిగ్‌బాస్ షో తెలుగులో 16 జూలై 2017న లాంచ్ అయింది. దీని మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు.
దీని తర్వాత సెకండ్ సీజన్ 10 జూన్ 2018న మొదలైంది. ఈ సీజన్ మన న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ చేసి ఆకట్టుకున్నారు.
దీని తర్వాత బిగ్‌బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 8 వరుకు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున హోస్ట్ చేసారు.
తాజాగా స్టార్ట్ అయిన బిగ్‌బాస్ సీజన్ 9కి కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వారం పూర్తి అయింది.
ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉండగా ఈ షోని సమంత కూడా హోస్ట్ చేసింది.
అవునా.? ఎప్పుడు అని ఆలోచిస్తున్నారా.? అయితే సామ్ హోస్ట్ చేసింది సీజన్ మొత్తం కాదు లెండి. ఒక్క ఎపిసోడ్ మాత్రమే.
2020 అక్టోబర్ 29న బిగ్‌బాస్ సీజన్ 4 ఎపిసోడ్‌కి నాగ్ మూవీ షూట్లో బిజీగా ఉన్నందున సమంత హోస్ట్‌గా వ్యవహరించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
టాయిలెట్ ఆ దిక్కున ఉందా.? దరిద్రం మీతో ఫుట్ బాల్ ఆడినట్టే..
ఆ బ్లడ్ గ్రూప్‌కి దోమలు ఫ్యాన్స్.. ఎందుకంటారు.?
గర్భిణులు చికెన్ లివర్ తినొచ్చా.? లాభమా.? నష్టమా.?