శాన్వి మేఘన.. చేసింది కొన్ని సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా కుర్రాళ్లు ఫిదా అయ్యారు.
ఈ ముద్దుగుమ్మ 1998 సెప్టెంబరు 12న హైదరాబాద్‌లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ 2019లో “సైరా నరసింహారెడ్డి” సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించింది.
ఆ తర్వాత “పిట్ట కథలు”, “బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్”, “పుష్పక విమానం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
“పుష్పక విమానం” సినిమాలో ఈ చిన్నదాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
తెలుగులో ఈ అమ్మడు ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో ఓ సినిమా చేసింది. తమిళ్ లో ఆమె కుటుంబస్థాన్ అనే సినిమాలో నటించింది.
కుటుంబస్థాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో మొన్నామధ్య టుక్ టుక్ అనే సినిమా చేసింది.
చేసిన సినిమాలన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ మూవీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.