ఇండస్ట్రీలోకి రాకుంటే ఆ జాబ్ చేసేదాన్ని: రుక్మిణీ..
02 March 2025
Prudvi Battula
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రుక్మిణీ వసంత్.
అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. భార్యగా, ప్రియురాలుగా కనిపించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ.
కెరీర్ ప్రారంభంలో థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రుక్మిణీ ఆ తర్వాత నటి కావాలి అనే ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
2019లో బీర్బల్ త్రైలోజి జి కేస్ 1. ఫైండింగ్ వజ్రముని అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది హీరోయిన్ రుక్మిణీ.
ఆ తర్వాత 2023లో సప్త సాగరాలు దాటి ఏ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. సౌత్ మూవీపై అందరి దృష్టి ఉందని తెలిపింది.
ఒకవేళ తాను సినీ ఇండస్ట్రీలోకి రాకపోయినట్లైతే ఖచ్చితంగా టీజర్ అయ్యేదాన్ని అని.. సినిమాల్లోకి వచ్చాక లైఫ్ మొత్తం మారిపోయిందట.
సప్తసాగరాలు దాటి సినిమా తర్వాత వరుస ఆఫర్స్ వస్తున్నయాని.. కొత్త భాషలు నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలిపింది.
భాష నేర్చుకోవడంతోపాటు అక్కడి ప్రేక్షకులకు ఎలా నచ్చుతాను అనే విషయంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది రుక్మిణీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
శంకర్ ఏం చేస్తాడబ్బా.. దిగ్గజ దర్శకుడికి అష్ట దిగ్భంధనం..!
సైడ్ సైడ్ ప్లీజ్.. అప్కమింగ్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారండహో..!
బాబోయ్ ఏంటీ కలెక్షన్లు.. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే బెటరా..?